- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ PGECET ఫలితాలు విడుదల
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(TG PGECET) ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(TG PGECET) ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 19, వరకు JNTUH ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున నిర్వహించబడగా.. 21,290 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఎగ్జామ్స్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాలను, ర్యాంక్ కార్డ్ ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.in లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై నాల్గవ వారంలో ప్రారంభమవనున్నట్టు సమాచారం.
Next Story






