ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపికైన గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లీలో జరిగే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపికైన గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లీలో జరిగే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లికి ఆహ్వానించింది. పంచాయతీ కార్యదర్శులు జే.షర్మిల, ఆర్​.శ్రీనివాస్​ రెడ్డి, వి.శ్రీనివాస్​, ఎం.దస్తగిరి, ఆర్​,రాంకిషోర్​, వైవీ రాజులు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. వీరు ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోటలో వీరికి పాల్గొంటారు. ఈ కార్యక్రమంతో పాటుగా గురువారం సాయంత్రం కేంద్ర పంచాయతీరాజ్​ శాఖ నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలను ఇదే స్పూర్తితో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్​సింగ్​ చౌహన్​ అన్నారు.

Next Story