- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్.. వెయిటింగ్ అంతా వాటి కోసమేనా?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఏ క్షణంలోనేనా రిలీజ్ కానుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ (Notification Schedule) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) కీలక సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ (Ranikumudini) నిర్వహించిన సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, అడిషనల్ డీజీ మహేశ్ భఘవత్, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖళ ముఖ్యకార్యదర్యదర్శులు, ఎక్సైజ్ కమిషనర్ తదితరలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలక్షన్ నిర్వహణకు ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల నివేదికలను ఎలక్షన్ కమిషన్ తీసుకుంది.
మొదట ఎంపిటీసీ ఆ తర్వాత సర్పంచ్:
మొదట ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని భావిస్తుండగా రిజర్వేషన్ల విషయంంలో ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కరసత్తు వేగవంతం చేస్తోంది. ఇక కోర్టుల్లో కేసులను సైతం ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో కోర్టునుంచి ఆదేశాలు ఏమైనా వస్తే ఆమెరకు నిర్ణయం ఉండేలా ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ లోపు స్థానిస సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గడువు లోపు ఎన్నికలు పూర్తి చేసే పరిస్థితి లేనందునా ఆలోపు నోటిఫికేషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసి వచ్చే నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం.






