- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RAIN ALERT: అక్టోబర్ వెదర్ రిపోర్ట్.. నెలరోజులు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణలో జూన్ నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ తరవాత వర్షాలు ఉండవని అంతా అనుకున్నారు. కానీ అక్బోబర్ నెలలోనూ వానలు దంచికొడతాయని వెదర్ మ్యాన్ బాలజీ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో జూన్ నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ తరవాత వర్షాలు ఉండవని అంతా అనుకున్నారు. కానీ అక్బోబర్ నెలలోనూ వానలు దంచికొడతాయని వెదర్ మ్యాన్ బాలజీ ప్రకటించారు. ముఖ్యంగా అక్టోబర్ 1 నుండి 10వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు.
ఉత్తర తెలంగాణ,తూర్పు తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ సహా మిగితా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కారణంగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే విధంగా అక్టోబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈశాన్య రుతుపవనాల రాక కారణంగా దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రా బార్డర్ లో అధిక వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ రోజుల్లో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.






