Telangana: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Gantepaka Srikanth |

రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) శుభవార్త చెప్పింది.

Telangana: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) శుభవార్త చెప్పింది. శుక్రవారం 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లేబొరేటరీ టెక్నీషియన్, లేబొరేటరీ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 17 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది. నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం https://www.tgprb.inలో చూడాలని అధికారులు తెలిపారు.

Next Story