- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం.. చివరి రోజున హోరెత్తించిన నేతలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Election) ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా మైకులన్నీ మూగబోయాయి. చివరి రోజుల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సూర్యపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వరంగల్‌లో కేటీఆర్, మెదక్‌లో హరీష్ రావు, నిజామాబాద్‌లో రాంచందర్ రావు, ధర్మపురి అర్వింద్ ప్రచారం చేశారు. మరోవైపు ప్రెస్‌మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈనెల 11న బుధవారం రోజున 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 2 వేల 982 వార్డులకు 12 వేల 930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు చివరిరోజున సుడిగాలి ప్రచారాలు నిర్వహించారు. ఈనెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.
బరిలో 12,993 మంది అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు ఓట్లు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల మంది మహిళా ఓటర్లు, 25 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల 203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,900 సమస్యాత్మక, 1,400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలను కూడా మూసివేశారు.






