Delhi: డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌తో తెలంగాణ ఎంపీలు.. ఫొటోస్ వైరల్

by Gantepaka Srikanth |

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాన్ ఇండియా పొలిటికల్ స్టార్(Pan India Political Star) అయిపోయారు.

Delhi: డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌తో తెలంగాణ ఎంపీలు.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాన్ ఇండియా పొలిటికల్ స్టార్(Pan India Political Star) అయిపోయారు. మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ(BJP) కూటమి సభ్యులు గెలుపొందారు. దీంతో ఫలితాల తర్వాత రెండ్రోజుల పాటు ‘ట్రూ పాన్ ఇండియన్ పొలిటికల్ హీరో’ అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) కుమార్తె అంజలి(Anjali) రిసెప్షన్‌ గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఫంక్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. దీంతో అదే ఫంక్షన్‌కు హాజరైన తెలంగాణ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), రఘునందన్ రావు(Raghunandan Rao)లు పవన్ కల్యాణ్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.


Next Story