- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 28 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 19 న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి 12 వరకు 6 వ తరగతి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష జరగనుంది. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.toms.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు ఓసీ విద్యార్థులకు రూ. 200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ. 125 చెల్లించాలి. రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.






