- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ చిరంజీవి పాటకు తెలంగాణ ఎమ్మెల్యే అత్త డాన్స్.. వీడియో వైరల్
తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జ వేడుకలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జ వేడుకలు కొనసాగుతున్నాయి. భక్తుల కోలాహలం మధ్య సంబురంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అయితే.. శుక్రవారం రాత్రి గణేష్ శోభయాత్రలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(Yashaswini Reddy) అత్త ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆమె డాన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన జై చిరంజీవా సినిమాలోని జై జై గణేషా సాంగ్(Megastar Chiranjeevi Song)కు అదిరిపోయే స్టె్ప్పులేశారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఝాన్సీ రెడ్డితో కలిసి చిందేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపతులను నేడు నిమజ్జనం చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌కు వచ్చే భక్తుల సౌకర్యార్ధం శనివారం ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడపనుంది. 30వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.






