కర్రెగుట్టల్లో కూంబింగ్ తక్షణమే నిలిపేయండి.. కేంద్రానికి కూనంనేని విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.

కర్రెగుట్టల్లో కూంబింగ్ తక్షణమే నిలిపేయండి.. కేంద్రానికి కూనంనేని విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. అడవుల్లోని లక్షల కోట్ల ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్‌లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని నిలిపివేయాలన్నారు.

ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే, మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఆసరాగా ఈ చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని కూనంనేని విమర్శించారు. నక్సల్స్ పేరు చెప్పి మానవ హననానికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని సాంబశివరావు అన్నారు.

Next Story