రూ.2 లక్షలు చెల్లించి నాలుగు దత్తత తీసుకున్న తెలంగాణ మంత్రి

by Gantepaka Srikanth |

హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్క్‌(Kakatiya Zoological Park)లోని నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా, అడవి దున్నలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) దత్తత తీసుకున్నారు.

రూ.2 లక్షలు చెల్లించి నాలుగు దత్తత తీసుకున్న తెలంగాణ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్క్‌(Kakatiya Zoological Park)లోని నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా, అడవి దున్నలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కాకతీయ జూ పార్క్(Zoological Park) అసిస్టెంట్ క్యురేటర్ మయూరి హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వచ్చి వన్యప్రాణల దత్తత ప్రక్రియను పూర్తిచేశారు. సంవత్సర కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం రూ.50 వేల చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి రూ.2 లక్షలను మంత్రి సురేఖ ఆన్లైన్‌లో చెల్లించారు.


ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. జూలలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు, తాబేళ్ళు మొదలు పులుల వరకు మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున దత్తత తీసుకుని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చిన మంత్రి సురేఖ తెలిపారు. జంతు ప్రేమికులు అటవీ అధికారులను సంప్రదించి వన్యప్రాణుల దత్తతకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి, వారి వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులుబాటును అటవీశాఖ కల్పిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వన్యప్రాణుల దత్తత కోసం చేసిన చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అటవీ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు.

Next Story