వీలైతే అసెంబ్లీకి వెళ్లు.. YS జగన్‌కు తెలంగాణ మంత్రి సలహా

by Gantepaka Srikanth |

వీలైతే అసెంబ్లీకి వెళ్లు.. YS జగన్‌కు తెలంగాణ మంత్రి సలహా

వీలైతే అసెంబ్లీకి వెళ్లు.. YS జగన్‌కు తెలంగాణ మంత్రి సలహా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీని మించిన వేదిక లేదు.. వీలైతే అసెంబ్లీకి వెళ్లండి అని సూచించారు. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతకే అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గతంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలమే ఉన్నా.. బీఆర్ఎస్‌పై పోరాడి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)ను కోమటిరెడ్డి కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటయ్యాక పక్కనే రహేజా మైండ్ స్పేస్‌లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తోందని.. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Next Story