- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలి.. తెలంగాణ మంత్రి ట్వీట్
అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) త్వరగా కోలుకోవాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆకాంక్షించారు.

దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) త్వరగా కోలుకోవాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు పెట్టారు. ‘‘పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురవడం ఆందోళనకరం. గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని.. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కోరుతున్నా’’ అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని స్కూల్‌లో చదువుతున్నాడు. మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు.
@APDeputyCMO, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురవడం ఆందోళనకరం.
— Konda Surekha (@iamkondasurekha) April 8, 2025
గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని... ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..
ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కోరుతున్న. https://t.co/pvsjzaKDim






