Water War: లోకేష్.. మా నీటిని ఒక్క చుక్క వదిలిపెట్టం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

by Ramesh Naini |

బనకచర్ల ప్రాజెక్టు అంశంపై టీడీపీ అగ్రనేత, ఏపీ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Water War: లోకేష్.. మా నీటిని ఒక్క చుక్క వదిలిపెట్టం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Banakacharla Issue) బనకచర్ల ప్రాజెక్టు అంశంపై టీడీపీ అగ్రనేత, ఏపీ మంత్రి లోకేష్ (Minister Lokesh) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే మంత్రి లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంచెం ముందు తెలుసుకోవాలని ఆయనకు సూచించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో నీటి లభ్యత దృష్ట్య 967 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన తర్వాత ఆ నికర, మిగులు జాలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని వివరించారు. అది తెల్వకుండా మభ్యపెట్టి ఏపీ ప్రజలను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటా, నాడు ట్రైబ్యునల్స్ నిర్ణయం చేసిన ప్రకారం.. మా నీటిని ఒక్క చుక్క వదిలి పెట్టమని తేల్చి చెప్పారు.

గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేసి ఉంటే.. మీరు పద్ధతిగా ఉండాల్సిన సీనియర్ నాయకులు అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అందరికీ గౌరవం ఉందని కొనియాడారు. కానీ నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదని హితవు పలికారు. వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరూ కోరుకోరు.. నికర, మిగులు జలాలు ఉపయోగించుకున్న తర్వాత సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. కానీ మాకు రావాల్సిన నీటి వాటా పూర్తి కాకముందే వరద జలాలు అంటూ ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారని మాట్లాడటం సరికాదన్నారు. మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రైతుల హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story