ఆరోజులు గుర్తుచేసుకొని తెలంగాణ మంత్రి భావోద్వేగం.. ఒక్కో చిత్రం ఒక్కో జ్ఞాపకం అంటూ కామెంట్

by Gantepaka Srikanth |

‘ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే.. నన్ను నా చిన్ననాటి రోజులకు తీసుకెళ్లు అని వేడుకుంటాను’ అంటూ ఇటీవల కమిటీ కుర్రోళ్లు సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆరోజులు గుర్తుచేసుకొని తెలంగాణ మంత్రి భావోద్వేగం.. ఒక్కో చిత్రం ఒక్కో జ్ఞాపకం అంటూ కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే.. నన్ను నా చిన్ననాటి రోజులకు తీసుకెళ్లు అని వేడుకుంటాను’ అంటూ ఇటీవల కమిటీ కుర్రోళ్లు సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితంలో అయినా బాల్యం అనేది మళ్లీ తిరిగి రాని అద్భుత జ్ఞాపకం. ఆ సినిమాలో హీరో చెప్పిన విధంగానే దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే.. నూటికి 90 శాతం మంది బాల్యాన్ని(Childhood) తిరిగి కోరుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. సంతోషం తప్పా.. ఏ బాధ్యతలు, ఉద్యోగాలు, బాధలు, కష్టాలు తెలియని రోజులు అంటే అందరికీ ఇష్టమే. ఎక్కడైనా నలుగురు బాల్య మిత్రులు కలిస్తే కచ్చితంగా వారి చిన్ననాటి రోజుల్ని నెమరు వేసుకుంటారు. లేదా? ఏదైనా ఫొటో చూసినా భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా.. తన బాల్యాన్ని, చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి(Telangana Minister) కొండా సురేఖ(Konda Surekha) భావోగ్వేగానికి గురయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.


‘‘జ్ఞాపకాల దొంతరాలలో వెతికి పట్టాను నా బంగారు బాల్యాన్ని. నన్ను నేనే మరచి, ఆనందించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. స్నేహితులతో పంచుకున్న.. నవ్వులు, పువ్వులు ఎన్నో క‌ళ్ళ ముందు క‌నిపించాయి. నడచిన బాటలు, ఆడిన తోటలు.. వెంటబడిన తూనిగలు.. వెంబడించిన తేనే టీగలు. పచ్చని చిలుకలు, పిచ్చుక గూళ్ళు... గాలి పటాలు, గాలి పాటలు. వేసిన ఊయలలు, చేసిన ఆకు బొమ్మలు.. స్వచ్చమైన నవ్వులు. కాలేజీలో విచ్చుకున్న బంధాలు.. పెంచుకున్న అనుబంధాలు... మెచ్చుకున్న ప్రేమలు. మళ్ళీ బాల్యం, కౌమారం తిరిగివస్తే.. మురిపెంగా దాచుకోనా బంగారు అక్షరాలతో’’ అని కొండా సురేఖ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Next Story