- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజనల్ వ్యాధులు విస్తరించే ఛాన్స్.. ప్రతి శుక్రవారం "డ్రై డే" అమలు: వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
రాష్ట్రంలో వర్షాలు రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వర్షాలు రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ (Medical and Health Department) తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రజా వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయం తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షం సూచన ఉండడంతో (seasonal diseases) సీజనల్ వ్యాధులు విస్తరించే అవకాశం ఉందని వాటిని నివారించడానికి సూచనలు తెలియజేసింది. డోర్లు, కిటికీలను మస్కిటో నెట్‌లతో కవర్ చేయడం ద్వారా వాటి రాకను నివరించవచ్చని పేర్కొంది. మరోవైపు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే.. "డ్రై డే" (Dry day) గా పక్కాగా అమలు చేసి నీటి నిల్వను నివారించాలని కోరింది. ఇక ఫిల్టర్ చేసిన లేదా కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని వెల్లడించింది.
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. బయట ఆహార పదార్థాలను తినొద్దని దీని కారణంగా జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక గాలి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ల నివారణకు అనారోగ్యం బారిన పడ్డ వారికి దూరం పాటించాలని చేతులు కలపడం లాంటివి చేయొద్దని ఒకవేళ చేసిన తప్పనిసరిగా శానిటైజర్ ద్వారా పరిశుభ్రం చేసుకోవాలని సూచించింది. ఎవరైనా దగ్గు జ్వరం తలనొప్పి, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలని కోరింది. ఎమర్జెన్సీ సమయంలో 108 కి కాల్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వారి సేవలను వినియోగించుకోవాలని ప్రకటనలో కోరింది.






