- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కువైట్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసి... కాపాడాలని వేడుకోలు
కువైట్(Kuwait)లో చిక్కుకున్న ఓ తెలంగాణ(Telangana) వాసి, ఎలాగైనా తనను ఇక్కడి నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : కువైట్(Kuwait)లో చిక్కుకున్న ఓ తెలంగాణ(Telangana) వాసి, ఎలాగైనా తనను ఇక్కడి నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేసాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య అనే వ్యక్తి కువైట్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. శాంతయ్య తన యజమానులు జీతాలు చెల్లించడం లేదని, కనీసం తిండి పెట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గత మూడు రోజులుగా తనను తిప్పుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మొరపెట్టుకున్నారు.
ఇక్కడి నుంచి తనను కాపాడాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని, శాంతయ్యను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీడియో






