Sunitha Rao: సంచలనం.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే టాప్!

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంచలనం సృష్టించింది. దేశంలోనే స్టేట్ మహిళా కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది.

Sunitha Rao: సంచలనం.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే టాప్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ (Congress Women's Wing) సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్షకు పైగా రావడం.. దేశంలోనే సభ్యత్వాలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గురువారం (Gandhi Bhavan) గాంధీభవన్‌లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు (Sunitha Rao) మాట్లాడుతూ.. దేశంలోనే సభ్యత్వాలో అగ్రగామిగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలిచిందని తెలిపారు.

ఇది తన విజయం కాదని, సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క చెల్లెల విజయమని చెప్పారు. ఈ మెంబర్షిప్ వెనుక అందరి కష్టం ఉందన్నారు. నేడు అన్ని రాష్ట్రాల కంటే పై స్థానంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక లక్ష సభ్యత్వాలు దాటిన సందర్భంగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా బ్యాండ్ టపాకులతో ఆటపాటలతో పెద్ద ఎత్తున గాంధీభవన్‌లో అన్ని జిల్లాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story