- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా
తెలంగాణలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు(Telangana Local Elections) రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. పోటీకి సిద్ధమవుతున్న నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో మరో వారంలో రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్లు తీసుకునే సమయంలోనే బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను నిలిపివేసింది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా జగ్రత్త పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలకవర్గాలు లేక దాదాపు 18 నెలలు గడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లల నిబంధన కూడా ఎత్తివేయడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం.






