- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల అప్‌డేట్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల అప్‌డేట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 17 మంత్రి మండలి సమావేశం నిర్వహించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం జోష్‌లో ఉంది. ఈ ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా లేదా తదుపరి నెల మొదటి వారంలోగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఎన్నికలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త స్థానిక నాయకత్వాన్ని అందించి, పార్టీ బేస్ ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే.. ఎన్నికల తర్వాత కూడా తమ ఆరు గ్యారంటీల అమలుకు స్థానిక సంస్థల ద్వారా మరింత వేగం పుంజుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.






