పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు కేంద్రమంత్రుల నివాళి

by Naga Rani Yarlagadda |

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు కేంద్రమంత్రుల నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తొలుత అమరవీరుల స్థూపం వద్ద సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, షెకావత్, దత్తాత్రేయ హాజరయ్యారు.

Next Story