తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

by Gantepaka Srikanth |

తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.

తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి(Telangana Legislative Council) నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మండలిలో పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. మున్సిపల్‌ సవరణ బిల్లును ఆమోదించారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల తర్వత సభను స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి పాస్ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్టగా.. సభ్యులంతా ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం చేసిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్సీ కవిత చివరి ప్రసంగం సైతం చేశారు. రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story