- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లలో ఇచ్చిన వస్తువులివే..
తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో.. స్కూల్ స్టూడెంట్స్‌కు 7, గురుకుల విద్యార్థులకు 22 వస్తువులతో ఉన్న కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందించారు.
పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 7 రకాల వస్తువులతో ఉన్న కిట్‌ను పంపిణీ చేశారు. దీంట్లో టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, స్కై బ్లూ, నేవీ బ్లూ యూనిఫాం, బ్లాక్ షూ, బ్లాక్ సాక్స్, టై, బెల్ట్ ఉన్నాయి.
గురుకుల విద్యార్థులకు 22 వస్తువులు..
ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు 22 వస్తువులు ఉన్న కిట్‌ను అందజేశారు. దీంట్లో టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, మెరున్ చెక్స్, మెరున్ యూనిఫాం, వైట్ యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బ్లాక్ షూ, బ్లాక్ సాక్స్, వైట్ షూ, వైస్ సాక్స్, టై, బెల్ట్, ఐడీ కార్డు, స్టేషనరీ సెట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రూక్ సూట్, వులెన్ బ్లాంకెట్, బెడ్ షీట్, కార్పెట్, టవల్, ట్రంక్ బాక్స్, ప్లాస్, గ్లాస్, కటోరా, స్పూన్, హ్యాండిల్ కప్ ఉన్నాయి.






