- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ మెడికోల మృతి.. తెలంగాణ జూడాల కీలక నిర్ణయం
అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 250 పైచిలుకు ప్రజలు చనిపోయారు. ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బందితో పాటు అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌కాలేజీ(BJ Medical College) మెడికోలు కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. మధ్యాహ్నం లంచ్ టైమ్ కావడంతో మెడికోలు అందరూ ఎయిర్‌పోర్టు సమీపంలోని హాస్టల్క్యాంటిన్హాల్లోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఫ్లైట్ వచ్చి హాస్టల్‌పై కూలింది. ఈ ప్రమాదంలో హాస్టల్ బిల్డింగ్ నేలమట్టమైంది. దీంతో 25 మందికి పైగా మెడికోలు అక్కడిక్కడే మృతిచెందగా, మందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణ జూనియర్ డాక్టర్లను(Telangana Junior Doctors) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం వారికి మృతికి జూనియర్ డాక్టర్లు తీవ్ర సంతాపం తెలియజేశారు. విద్యార్థుల మృతికి సంఘీభావంగా మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చారు.






