హామీల అమలుకు తెలంగాణ ఉద్యోగ JAC జంగ్ సైరన్

by Muthe.Rajitha |

తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) మరోసారి జంగ్ సైరన్ మోగించింది.

హామీల అమలుకు తెలంగాణ ఉద్యోగ JAC జంగ్ సైరన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) మరోసారి జంగ్ సైరన్ మోగించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 200కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో కలిసి మరోసారి ఉద్యమించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ వారికి అందలేదని మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగుల 63 దీర్ఘకాల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో టీజెఈజేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1న 'పెన్షన్ విద్రోహ దినం'గా నిర్వహించనున్నట్టు తెలిపింది.

అలాగే అక్టోబరు 12న రాష్ట్రవ్యాప్త ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో కలిసి భారీ 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కాగా TGEJAC ప్రధాన డిమాండ్లలో డియర్‌నెస్ అలవెన్స్(DA) బకాయిలు, హెల్త్ బెనిఫిట్స్, పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ, 51% ఫిట్‌మెంట్‌తో పే రివిజన్, ఔట్‌సోర్సింగ్ సమస్యలు, గతంలో జారీ చేసిన GO 317 సమీక్షవంటివి ఉన్నాయి.

Next Story