‘మీరు ఎమ్మెల్సీ కావడం మా దౌర్భాగ్యం’.. కవితకు తెలంగాణ జనసేన స్ట్రాంగ్ కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-01 09:24:00  IST  )

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ(Jana Sena Party) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

‘మీరు ఎమ్మెల్సీ కావడం మా దౌర్భాగ్యం’.. కవితకు తెలంగాణ జనసేన స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ(Jana Sena Party) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ‘పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. అది ఏపీ ప్రజల దురదృష్టం. ఆయన ఇంకా రాజకీయ పరిపక్వత చెందలేదు. ఆయన కామెంట్లను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన బీజేపీ నీడలో ఉన్నారు కాబట్టి.. ఆ పార్టీకి అనుకూలంగా రోజుకో స్టేట్‌మెంట్ చేస్తున్నారు’ అని పవన్ కల్యాణ్‌పై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత కామెంట్లపై జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జి మేకల సతీశ్ రెడ్డి(Mekala Satish Reddy) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కవిత వ్యాఖ్యలను ఖండించారు.

‘మీరు మాట్లాడిన మాటలు నిజమే కవితక్కా.. పవన్ కల్యాణ్‌కు రాజకీయం చేయడం చేతకాదు. ముఖ్యంగా మీ రాజకీయానికి ఆయన రాజకీయానికి చాలా తేడా ఉంది. ఏమాత్రం పొలిటికల్ నాలెడ్జ్ లేకుండానే 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవడమే కాకుండా వందశాతం సక్సెస్ సాధించారు. మీకు అద్భుతమైన పొలిటికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జీరో సీట్లు వచ్చాయి. లిక్కర్ దందా చేసి.. తెలంగాణ పరువును ఢిల్లీ స్థాయిలో తీసిన మీరు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది. పవన్ కల్యాణ్‌ది మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాబట్టే.. కొడుకుకు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసినా.. గిరిజనులకు ఇచ్చిన మాట కోసం వెళ్లాడు. మీలాగా అధికారంలోకి రాగానే దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. మూడు ఎకరాల భూమి ఇస్తాం.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం.. దళితబంధు, బీసీ బంధు అంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేయలేదు. పవన్ కల్యాణ్ గట్టిగా తెలంగాణలో రెండు మీటింగులు పెడితే చాలు.. మీ బీఆర్ఎస్ పార్టీ జీరో అవ్వుద్ది. ఎవరిమీదైనా విమర్శలు చేసేటప్పుడు ముందు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. మీరు ఎమ్మెల్సీ కావడం మా దౌర్భాగ్యం’ అని సతీశ్ రెడ్డి హితవు పలికారు.

Video Link

Next Story