నీ అయ్య జాగీరా.. తెలంగాణ? తమ్ముడు! పవన్ కల్యాణ్ వివాదంపై తెలంగాణ జనసేన లీడర్ ఫైర్

by Ramesh Naini |

ఏపీ, తెలంగాణ మధ్య దిష్టి రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

నీ అయ్య జాగీరా.. తెలంగాణ? తమ్ముడు! పవన్ కల్యాణ్ వివాదంపై తెలంగాణ జనసేన లీడర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ, తెలంగాణ మధ్య దిష్టి రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దిష్టి కళ్లు అంటూ మాట్లాడిన పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌‌‌‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై తెలంగాణ జనసేన లీడర్ శిరీష స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. మా తెలంగాణ మా హైదరాబాద్ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు ఆస్తులు కొన్నావు అని మాట్లాడారని మండిపడ్డారు. నీ అయ్యా జాగీరా.. తెలంగాణ? తమ్ముడు.. అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడింది ఏమిటి? మీరు మాట్లాడేది ఏమిటి? అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్‌ని బహిష్కరించమని అంటున్నావు? నీ స్థాయి తెలుసుకో అని విమర్శించారు. జడ్చర్ల ప్రజల దగ్గరికి వెళ్లు ముందు, వాళ్ళు మరిచిపోయారు.. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు అర్థం చేసుకునే శక్తి యాడ ఉంది నీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గత నెల 26 వ తేదీన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘గోదావరి జలాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే. ఆ శాపం తగిలినట్టుంది. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని, తెలంగాణ నాయకులంతా అంటారు. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు. అత దిష్టి తగిలింది కోనసీమకు’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, ఆ రోజు నేను ఎలాంటి చెడు ఉద్దేశంతో అనలేదని తాజాగా పవన్ కల్యాణ్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి లేఖ విడుదల అయింది. వీడియో ఇదే..

Next Story