- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జాగృతి భవిష్యత్ తేల్చేసిన కవిత.. TRS పార్టీపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రక్షణ సేన (TRS) లక్ష్యాలను కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నాపై సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి ఎన్టీవోగా మారుతుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. జెన్ జీ యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు వెళ్తుందన్నారు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‍లో మీట్ ది ప్రెస్‍లో మాట్లాడిన కవిత తాను స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై పలు కీలక అంశాలు వెల్లడించారు. అందరి జీవితాల్లో వెలుగుల కోసం పోరాడుతామని సర్వోదయ తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నామన్నారు. పాంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎంత పెద్ద జబ్బు చేసినా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు.
అవాకులు చేవాకులు పేలుతున్నారు:
ధాన్యం కొనుగోళ్లను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నారని ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అంటే హాస్యాస్పదం అయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులు రైతుల తమ ధాన్యం అమ్ముకునే విషయంలో ఎలాంటి ఆందోళనలు ఉండవన్నారు. రాష్ట్ర ప్రజలకు అమ్మలా ఉంటానని నేను చెబితే చాలా మంది సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఇవాళ్టి ప్రభుత్వాలకు అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగా జరగడం లేదన్నారు. ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టారు కానీ వికలాంగుల కోసం ర్యాంప్స్, ప్రత్యేక టాయిలెట్స్ లేవన్నారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లేదన్నారు.
సీఎం తెలంగాణలో సిమ్ ఢిల్లీలో:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తే అయినా సిమ్ కార్డు మాత్రం ఢిల్లీదని కవిత ఎద్దేవా చేశారు. అనేక హమీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి అమలుపై మాట్లాడటం లేదన్నారు. మైనార్టీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఓవర్ సీస్ స్కాలర్ షిప్‍లు, రిజర్వేషన్లపై సీఎం మాట్లాడటం లేదన్నారు. భూనిర్వాసితులపై పోరాటం చేస్తామన్నారు. వారికి లీగల్ సపోర్టు కూడా అందజేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తెలంగాణలో 800 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నట్లు బోనస్ రోజులు కలిపితే 1000 రోజుల్లో ఉన్నాయని ఈ వెయ్యి రోజుల్లో కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతామని కాంగ్రెస్ ను గద్దె దించుతామన్నారు.






