మా నాన్న కేసీఆర్‍ను నేను తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన కవిత

by Prasad Jukanti |   (  Updated:2026-05-02 07:43:46  IST  )

కేసీఆర్‌పై విమర్శల నేపథ్యంలో కవిత స్పష్టతనిచ్చారు. తండ్రిగా ఆయనపై గౌరవం ఉందని, కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడితో సిద్ధాంతపరమైన విభేదాలున్నాయని తెలిపారు.

మా నాన్న కేసీఆర్‍ను నేను తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‍పై తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన(TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పందించారు. నేను మా నాన్నను విమర్శించలేదని రాజకీయ నాయకుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాత్రమే కేసీఆర్‍ను విమర్శించాను తప్పితే మా నాన్న కేసీఆర్ ను నేను విమర్శించ లేదన్నారు. ఇవా బషీర్‍బాగ్ ప్రెస్ క్లబ్‍లో మీట్ ది మీడియా కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కవిత.. మా నాన్న కేసీఆర్ తో నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదన్నారు. ఓ హిందూ మహిళగా ప్రతిరోజు ఉదయం పూజ వేళలో స్మరించుకునే పేర్లలో తల్లిదండ్రుల పేర్లు కూడా ఉంటాయన్నారు.

కేసీఆర్ తో సిద్ధాంతపరమైన విభేదాలు:

నా తల్లిదండ్రులతో నాకు ఎలాంటి సమస్య లేదని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో తనకు కచ్చితంగా ఐడియాలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని ఈ విషయంలో మొన్న విమర్శించానని ఆయన తప్పు చేస్తే భవిష్యత్‍లోనూ విమర్శిస్తానని స్పష్టం చేశారు. నేను తప్పు చేస్తే బీఆర్ఎస్ వాళ్లు నన్ను విమర్శించవచ్చు. వ్యక్తిగతంగా కేసీఆర్ ను నేను ఒక్కమాట కూడా అనలేదు. తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన తొలి ప్రభుత్వం కొన్ని పనులు చేసి ఉంటే బాగుండేది. కృష్ణా, గోదావరి నదులను సరిగా వాడుకుని మన పొలాలకు నీళ్లు వచ్చి ఉంటే మన రైతులకు మేలు జరిగేది. కానీ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు రూ.1 లక్ష 21 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది మాత్రం కేవలం 1 లక్ష ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన యువకులకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వలేమా? అన్ని దేశాలకు వెళ్లి స్పీచ్ లు ఇచ్చే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఉండగా ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన వల్ల రెండు తరాల యువకులు నష్టపోయారని అన్నారు.

తెలంగాణ జాగృతి భవిష్యత్ తేల్చేసిన కవిత.. TRS పార్టీపై కీలక వ్యాఖ్యలు

Next Story