- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Jagruti: పేరు మార్చితే పేదల జీవితాలు మారవు
Telangana Jagruti: పేరు మార్చితే పేదల జీవితాలు మారవు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చితే పేదవాళ్ల జీవితాలు మారవని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్ అన్నారు. బుధవారం జాగృతి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాళ్లను మరింత పేదవాళ్లు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చటమే కాకుండా దాన్ని నీరుగార్చే పద్ధతుల్లో బిల్లు ప్రవేశ పెట్టారని తెలిపారు. వంద రోజుల పనిని 125 రోజులు చేస్తామంటునడం సంతోషమే అయినప్పటికీ.. కానీ వంద రోజుల పని ఉన్నప్పుడే పేదలకు పని దొరకడం లేదని ఆరోపించారు. ఇప్పుడు 125 రోజులు ఎలా పని కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించి 40 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలంటే ఏ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించదన్నారు. బీజేపీ చేస్తున్న పని పేదలకు గొడ్డలి పెట్టుగా మారుతుందన్నారు. గాంధీ పేరు మారిస్తే కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నదని.. రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బతుకమ్మ చీరల పేర్లను మార్చారని ఆరోపించారు. అప్పుడు తెలంగాణ ప్రజలు, మహిళలు బాధపడలేదా అని నిలదీశారు. అసలు ఇందిరమ్మతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు.






