జీవో 252ను రద్దు చేసి.. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాల్సిందే: తెలంగాణ జాగృతి డిమాండ్

by Ramesh Naini |

జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని.. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్ డిమాండ్ చేశారు.

జీవో 252ను రద్దు చేసి.. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాల్సిందే: తెలంగాణ జాగృతి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని.. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం జాగృతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జీవోకు వ్యతిరేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న ఉద్యమానికి, ఆందోళనకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను వంచించినట్లే మీడియాను సైతం వదలని చీడపురుగుగా భావిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 23 వేలకు పైగా అన్ని రకాల జర్నలిస్టులు ఉన్నారని.. వారందరికీ సమానంగా అక్రెడిటేషన్లు వచ్చేలా గత ప్రభుత్వం 2016 లో జీవో 239ని విడుదల చేసిందన్నారు. కానీ.. ఈ ప్రభుత్వం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు అంటూ విడదీసిందని.. సమాన హక్కులున్నప్పుడు రెండు రకాల పేర్లు ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు ఇచ్చే ఆరోగ్య కార్డులకు సంబంధించి నిధులు విడుదల చేయలేదన్నారు. దాంతో అనారోగ్యానికి గురైన కుటుంబాలు సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందన్నారు.

Next Story