- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భరోసా
పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అండగా నిలిచింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందిన శామీర్‌పేట నరేంద్ర చారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత (Ashritha) మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు. రెక్కల కష్టంపై బతికే నరేంద్ర చారి హఠాన్మరణం పాలవడంతో బిడ్డ చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థిని తల్లి స్వప్నకు కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో విశ్వకర్మ టీవీ ఛానల్ నిర్వాహకుడు నర్సింహా చారిని సంప్రదించగా ఆయన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కి ఆశ్రిత పరిస్థితిని వివరించారు. ఆమె ముందుకు వచ్చి ఆశ్రిత ఫీజు చెల్లిస్తానని భరోసానిచ్చారు. మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని శుక్రవారం ఆశ్రిత, ఆమె తల్లి స్వప్నకు అందజేశారు.






