- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Jagruti: కాంగ్రెస్ పార్టీది ఒక్కోచోట ఒక్కో మాట
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీసీ జాగృతి అధ్యక్షుడు ఇత్తరి మారయ్య, క్రిష్టియన్ జాగృతి అధ్యక్షుడు డేవిడ్, ఎంబీసీ, సంచార జాతుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, నాయకులు ఆనంద్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై కాంగ్రెస్ పార్టీ ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతున్నదని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం నిర్లక్ష్యం వందశాతం కారణమన్నారు.
రైతులు ముందస్తుగా పంట సాగు చేయడంతోనే యూరియా కొతర తలెత్తిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్తుంటే దానికి భిన్నంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రియాంకాగాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నదని సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వాదన అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే యూరియా సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఎదురుకాని సమస్య కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు మొదలైందని నిలదీశారు. ప్రభుత్వం యూరియా కొరత తీర్చకుంటే తెలంగాణ జాగృతి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.






