- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టిన తెలంగాణ జాగృతి
రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణీ కొట్టింది. జాగృతి బలపర్చిన ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణీ కొట్టింది. జాగృతి బలపర్చిన ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడి బిలోలిలో జాగృతి బలపరిచిన శంకర్ సర్పంచ్‌గా గెలిచారు. అంతేకాకుండా బోధన్ మండలం మినార్ పల్లి తారాలో చంద్, రెంజల్ మండలం విరన్న గుట్టతండాలో సుమలత జాదవ్, నవీపేట మండలం రాంపూర్ లో కమలాకర్, రెంజల్ గ్రామ సర్పంచ్ గా తిరుపతి లలిత హన్మాండ్లు విజయం సాధించారు.
కాగా కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తరవాత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. జాగృతి పేరుతోనే కవిత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ జాగృతిని 2006లో కవిత ప్రారంభించగా దీని ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు పూర్తిగా జాగృతిపైనే దృష్టి పెట్టిన కవిత త్వరలోనే తన రాజకీయ పార్టీగా ప్రకటించే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More..
ఆ గుంట నక్కలకు చెప్తున్న ఒక్కొక్కడి తోలు తీస్తా.. కవిత మాస్ వార్నిగ్






