- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గుంట నక్కలకు చెప్తున్న ఒక్కొక్కడి తోలు తీస్తా.. కవిత మాస్ వార్నిగ్
బీఆర్ఎస్ పై మరోసారి కవిత రెచ్చిపోయింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతల అవినీతిపై తానింకా చిట్టా విప్పనే లేదని ఇప్పుడు కేవలం టాస్ మాత్రమే వేశాను ఇంత దానికే ఉలిక్కి పడితే ఎలా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. త్వరలనే మీ అవినీతి, అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతోందని హెచ్చరించారు. మీ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేయొద్దు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తానని హెచ్చరించారు. ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. కాంగ్రెస్‍తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై తాను ఆరోపణలు చేస్తుందని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా.. నా మీద అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతానని హెచ్చరించారు. తనకు ఓ రోజు వస్తుందని తాను సీఎం అవుతానని అప్పుడు మీ అందరి అక్రమాలపై విచారణ జరిపిస్తానన్నారు. జనంబాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయన్నారు.
హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్సే:
హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ పాలసీకి బీఆర్ఎస్ బాటలు వేస్తే కాంగ్రెస్ రహదారులు వేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్లకు డెవలప్ మెంట్ కోసం ఇచ్చారని అందులో ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్ కు ఇచ్చారని ఇందులో మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్ గా ఉన్నారని దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. తాము మాధవరం కృష్ణారావుపై దాడి చేసే అవసరం లేదని ఆని ఆయన వెనుక ఉన్న గుంట నక్కను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ పదేళ్లలో తాను కానీ తన భర్త కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధిపొందింది లేదని మీకు దమ్ముంటే నేను మీ మీద చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి తప్ప ఈ వెక్కిలి చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అవసరం అయినప్పుడు నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాను. తాను హరీశ్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తానని హెచ్చరించారు. గాజుల రామారంలో భూములు కబ్జాలు పెట్టింది ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్ కదా అని ప్రశ్నించారు.
ఆ ఇద్దరితోపాటు టీ-న్యూస్‌కు లీగల్ నోటీసులు..
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతోపాటు టీ-న్యూస్‍కు కవిత లీగల్ నోటీస్ పంపించారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.






