- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సభ్యులు తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతి సారధిలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కవితను కోరారు. ఎన్నికల సమయంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మాకు ఉద్యోగాలు కల్పించలేదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాల కోసం ఫోరంగా ఏర్పడి పోరాటం చేస్తున్న కళాకారులకు తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన కళాకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద కళాకారులు చేపట్టే ధర్నాలో తెలంగాణ జాగృతి పాల్గొంటుంది అని తెలిపారు.






