Group-1: టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి జాగృతి నేతల యత్నం.. టెన్షన్..టెన్షన్

by Prasad Jukanti |

గ్రూప్ -1 వివాదంపై తెలంగాణ జాగృతి నేతుల ఆందోళ చేపట్టారు.

Group-1: టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి జాగృతి నేతల యత్నం.. టెన్షన్..టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రూప్-1 అంశంలో (Group-1 Controversy) నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నేతలు (Telangana Jagruthi) ముట్టడికి యత్నించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని కమిషన్ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జాగృతి నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కార్యాలయం ఎదుటే బైఠాయించిన జాగృతి నేతలు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వివిధ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని, తిరిగి గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story