- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లన్నా నువ్వు జర్నలిస్టా? కోవర్టా?.. జాగృతి మహిళా విభాగం ఫైర్
హరీష్ రావు డైరెక్షన్లో మల్లన్న చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడతామని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: హరీష్ రావు డైరెక్షన్లో మల్లన్న చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడతామని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను జాగృతి మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మల్లన్న ఓ జర్నలిస్టా బ్లాక్ మెయిలర్ ఆ అని తెలంగాణ సమాజం అనుకుంటోందన్నారు. మల్లన్న అసలు జర్నలిస్టా, రాజకీయ నాయకుడా అని ప్రశ్నించారు. లేదంటే బీఆర్ఎస్ కోవర్టువా.. హరీష్ రావు కోవర్డువా అని మండిపడ్డారు. కవిత కోలిగాటికి కూడా మల్లన్న సరిపోడంటూ మండిపడ్డారు.
కవిత పిల్లల మీద ఛాలెంజ్ చెయ్యడానికి నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే ఎవరికి కవిత ఛాలెంజ్ విసిరిందో వాళ్లే వచ్చి మాట్లాడాలన్నారు. బీసీ ఉద్యమం పేరుతో పార్టీ పెట్టిన నువ్వు చేసిందేంటని ప్రశ్నించారు. నీ వెనుక ఉన్నవాళ్లకే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో తెలియదన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నావని మండిపడ్డారు. కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిందని, దమ్ముంటే నువ్వు కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మల్లన్నకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ మల్లన్నతో మాట్లాడించడం ఆపాలని, దమ్ముంటే ఆ పార్టీ నాయకులే ముందుకు వచ్చి మాట్లాడాలని మాధవి సవాల్ చేశారు.






