- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే.. ఎంపీ డీకే అరుణ
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే అని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణలో విజయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు. వికాసిత్ భారత్ లక్ష్యం నరేంద్ర మోడీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించి, పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ఇవాళ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ వికాసిత్ భారత్‌లో భాగంగా ప్రతి రాష్ట్ర అభివృద్ధి చెందాలని తెలంగాణలో రూ.10 వేల కోట్ల నిధులతో మోడీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల కల నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరాలంటే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతోనే డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమైతుందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దేశ భవిష్యత్తును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీర్చిదిద్దాలని, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. మోడీ చూసేందుకు తరలివచ్చిన జనంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జనసంద్రంగా మారిందని డీకే అరుణ అన్నారు.






