Vijayashanthi : తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి

by Muthe.Rajitha |

తెలంగాణ కేసీఆర్(KCR) సొత్తు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijayashanthi) మండిపడ్డారు.

Vijayashanthi : తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేసీఆర్(KCR) సొత్తు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijayashanthi) మండిపడ్డారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆరోజు టీడీపీ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారన్నారు. తాను తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడని గుర్తు చేశారు. నా తల్లి తెలంగాణ పార్టీ(Talli Telangana Party)ని విలీనం చేయమని కేసీఆరే వెంట పడ్డారని, పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఇద్దరమే కొట్లాడుతున్నప్పుడు ఆయన మాత్రం ఎందుకు ఎగ్జిట్ అయ్యారని నిలదీశారు. కేవలం దొరలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బడుగు, బలహీన వర్గాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదని 1200 మంది అమరులైతే తెలంగాణ వచ్చిందని, అంతేగాని తెలంగాణ కేసీఆర్ ఒక్కడి సొత్తు కాదని మండిపడ్డారు.

ఉద్యమకారులను తొక్కేసిన ఘన చరిత్ర ఆయనదని, తాను ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, మీరు మాత్రం ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని కేవలం పదేళ్ళ కాలంలో 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఎం చేశారో లెక్కలు చెప్పాలని, లేదంటే ఆయనను వదిలేది లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులను బీజేపీ(BJP)) ఈ రాష్ట్రంలో దింపాలని చూస్తోందని మళ్ళీ దొరా బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితిని బీజేపీ మళ్లీ తీసుకురాబోతోందని వెల్లడించారు. అందుకే ఉద్యమ నాయకులను అణచివేస్తున్నారని అన్నారు. బీజేపీలో ఉంటే మాకు ఏం గౌరవం ఇచ్చారని, తాను ఆ పార్టీలోనుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు.

Next Story