కులగణనలో తెలంగాణ రోల్ మోడల్: రాహుల్ గాంధీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-30 16:44:56  IST  )

కులగణనలో తెలంగాణ రోల్ మోడల్: రాహుల్ గాంధీ
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశం మొత్తం కులగణన చేస్తామని కేంద్రంలోని బీజేపీ సర్కార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు ఒప్పుకున్నందుకు ప్రధాని మోడీకి థాంక్య్ చెప్పారు. కేంద్రం ఏ కారణం చేత ఒప్పుకున్నా తమకు సంతోషమేనని అన్నారు. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని స్పష్టం చేశారు.

గతంలో బీహార్ రాష్ట్రంలో జరిగిన కులగణనకు తెలంగాణలో జరిగిన కులగణనకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పారదర్శకంగా కులగణన జరిగిందని తెలిపారు. దేశంలో కులగణన ఎలా చేస్తారో చెప్పాలని కోరారు. బడ్జెట్‌లో కులగణన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి సూచించారు. దేశ అభివృద్ధి కుల‌గ‌ణ‌న‌తోనే సాధ్య‌మ‌ని, ప్రైవేటు సంస్థ‌ల్లోనూ రిజ‌ర్వేష‌న్లు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు మోడీ స‌ర్కార్ కుల‌గ‌ణ‌న‌పై నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కుల‌గ‌ణ‌న‌తో దేశ ఆర్థిక ప‌రిస్థితి సైతం మెరుగుడుతుంద‌ని చెప్పారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని దేశ‌మంతా ఖండిస్తోంద‌ని కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా మ‌ద్ద‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story