- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో అల్పపీడనం: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు వర్షం ముంపు పొంచి ఉంది...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)కు వర్షం(Rain) ముంపు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 13న బంగాళాఖాతం(Bay of Bengal)లో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ద్రోణి ప్రభావం ఈశాన్య బంగాళాఖాతం వరకూ కొనసాగనుందని తెలిపింది. దీంతో ఈ రోజు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం సైతం వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి భారీగా నీరు చేరింది. దీంతో రోడ్లపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి. వాన నేపథ్యం లో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమ య్యారు. లోతట్టు ప్రాంతా ల్లో సహాయక చర్యలు చేపట్టారు.






