‘తెలంగాణోళ్లు అంటర్రా బాబూ’.. మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-15 10:31:18.0  )
‘తెలంగాణోళ్లు అంటర్రా బాబూ’.. మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కల్చర్‌(Telangana Culture)లో పండుగలు వస్తే సుక్క, ముక్క కామన్. ఈ విషయం అందరికీ తెలుసు. ఇంట్లో ఏదైనా దావత్ జరిగినా, ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీ జరిగినా, నలుగురు ఫ్రెండ్స్ కలిసినా తప్పకుండా సిట్టింగ్ వేస్తుంటారు. ముఖ్యంగా దసరా, బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి, న్యూఇయర్ వేడుకలు వంటివి వస్తే ఆరోజు మద్యం అమ్మకాల్లో తెలంగాణ చరిత్రలు తిరగరాస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాల్లో తెలంగాణ గత కొన్నేళ్లుగా దేశంలోనే టాప్‌లో కొనసాగుతోంది. తాజాగా విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి(Union Health Minister) స్పష్టం చేశారు. రాజ్యసభ(Rajya Sabha)లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) సమాధానం ఇచ్చారు. సౌత్ ఇండియాలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఏకంగా 50 శాతం మంది పురుషులు రోజూ మద్యం(Alcohol ) సేవిస్తున్నారని.. ఇది ఈ మద్య కాలంలో కాస్త తగ్గిందని వెల్లడించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం.. ఏపీలో 34.9శాతం మంది, తెలంగాణలో 53.8శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. అయితే, 2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2శాతం, తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారట. 2024 జూన్ నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటితోపాటు బార్లు, క్లబ్బులు అదనంగా ఉన్నాయి.

మొన్నటి సంక్రాంతి పండుగ వేళ కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు స్పష్టం చేశారు. న్యూఇయర్ వేళ రూ.680 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. దీంతో రాష్ట్రంలో ఏ పండుగ అయినా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed