- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ దేశానికి రోల్ మోడల్ : రాహుల్ గాంధీ
తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన (SEEEPC) సర్వే దేశవ్యాప్త కులగణనకు రోల్‌మోడల్‌గా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రశంసించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన (SEEEPC) సర్వే దేశవ్యాప్త కులగణనకు రోల్‌మోడల్‌గా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రశంసించారు. నేడు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈ సర్వే వివరాలను రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పార్టీ ఎంపీలకు వివరించారు.
ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతూ... కులగణన నిర్వహణ సులభం కాదని, రేవంత్, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రభుత్వం అంచనాలకు మించి రాణించిందని ప్రశంసించారు. సరైన డేటా ఆధారంగా సామాజిక న్యాయం, సాధికారత కోసం విధానాలు రూపొందించవచ్చని, తెలంగాణ ఈ డేటాను సాధించిందని అన్నారు. ఈ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించగా.. వీటిని రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని స్పష్టం చేసారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూపర్‌వైజర్లు 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్‌లలో 56 ప్రశ్నలతో ఇంటింటికీ వెళ్లి 3.55 కోట్ల మంది జనాభా (96.9%) డేటాను సేకరించారు, 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో డిజిటలైజేషన్ పూర్తి చేశారు. సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలో బీసీలు 56.4% (బీసీ ముస్లింలు 10.08%), ఎస్సీలు 17.45%, ఎస్టీలు 10.08%, ఉన్నత కులాలు 10.09%, 3.09% మంది కులం లేనివారిగా పేర్కొన్నారు.






