ఆ విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Ramesh Goud |

కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

ఆ విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఢిల్లీ (Delhi)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ (Congress Working Committee Meeting) జరిగింది. ఈ మీటింగ్ కి ఏఐసీసీ అగ్రనేతలు (AICC leaders) సహా పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు (Congress Leaders) హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. జన గణనలో కుల గణన (Caste Census)కు తెలంగాణ మోడల్ (Telangana Model) ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసిందని తెలిపారు.

నాలుగు గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాక మొత్తం పౌర సమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కుల సంఘ నాయకులు, విద్యావేత్తల నుండి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కుల గణన చేపట్టిన విషయాన్ని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో ప్రస్తావించిందని అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని, ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా.. కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొక్కసారి నా అభినందనలు అని రేవంత్ రాసుకొచ్చారు.

Next Story