CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి రెండు రోజుల పాటు ‘భారత్‌ సమ్మిట్‌ 2025’ నిర్వహించిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి రెండు రోజుల పాటు (Bharat Summit) ‘భారత్‌ సమ్మిట్‌ 2025’ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భారత్ సమ్మిట్‌పై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ‘తెలంగాణ వేదికగా వందకు పైగా దేశాలు వందల ఆలోచనల సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయడం. ప్రజల హక్కులలో సమానత్వాన్ని చాటడం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దిశానిర్దేశంలో అభివృద్ధిలోనే కాదు ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ’ అని సీఎం పేర్కొన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని ‘భారత్‌ సమ్మిట్‌’‌లో తీర్మానం చేశారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని భారత్‌ సమ్మిట్‌ ఖండించారు.

Next Story