నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

by velandi.Saikiran |

ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియ‌ర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియ‌ర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఫలితాలు ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక ఈ పరీక్ష ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ రిజల్ట్స్ వెబ్ సైట్ లేదా TGBIE అధికారిక వెబ్ సైట్ లలో (https://tgbienew.cgg.gov.in/home.do) చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ల‌లో హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ టైప్ చేస్తే, రిజల్ట్ వచ్చేస్తుంది.

కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో 3.98 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్, డిగ్రీ ప్రవేశాలు, ఇతర ఉన్నత విద్యా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ప్రకటిస్తున్నారు.

Next Story