కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు 2 నెలల గడువు

by velandi.Saikiran |

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు గడువును రెండు నెలలకు పెంచారు.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు 2 నెలల గడువు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త కారు, బైక్, ఇతర భారీ వాహనాలు కొనేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు గడువును రెండు నెలలకు పెంచారు. తమ వాహనాలకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంచుకోవడానికి రెండు నెలల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుత రూల్స్ ప్రకారం TR తేదీ నుంచి నెల రోజుల సమయం మాత్రమే గడువు ఉండేది. అయితే ఇకపై నెంబర్లను రిజర్వు చేసుకునేందుకు మరో నెల పొడగించారు. ఈలోగా ఫ్యాన్సీ నెంబర్ రిజర్వ్ చేసుకోకపోతే వాహన్ సాఫ్ట్ వేర్ ఆటోమెటిక్ గా ఓ నెంబర్ కేటాయిస్తుందని అధికారులు ప్రకటించారు. ఇక స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై వాహ‌న‌దారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story