- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన పేరు మార్పునకు కారణం అదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తన అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని, తర్వాత అది పవన్ కళ్యాణ్ గా మారిన కారణాన్ని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు ఆసక్తి చూపించారు. మొదట తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్‌గా పనిచేశారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా పోటీ చేసిన జనసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ తన అసలు పేరు ఏమిటి? అది ఎలా మారిందనే విషయాన్ని క్లియర్‌గా వివరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నా అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. స్కూల్ సర్టిఫికెట్లలో నా పేరు నుంచి ‘శ్రీ’ తొలగిపోయి కే. కళ్యాణ్ కుమార్‌గా మిగిలింది. ఆ తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు నా పేరు ముందు ‘పవన్’ చేర్చారు. అలా నా పేరు పవన్ కళ్యాణ్‌గా మారింది” అని చెప్పుకొచ్చారు.






