- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోచ్ గంభీర్ పై సీనియర్ ప్లేయర్ల తిరుగుబాటు !
భారత కోచ్ గంభీర్ పై సీనియర్ ప్లేయర్ల తిరుగుబాటు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ క్రికెటర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఆ తర్వాత సద్దు మణిగింది. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ వస్తోన్న నేపథ్యంలో మళ్లీ గంభీర్ ను సీనియర్ క్రికెటర్లు టార్గెట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ను కాదని కొందరు భారత సీనియర్ క్రికెటర్లు పెద్ద వ్యవహారం నడిపిస్తోన్నట్లు తెలుస్తోంది.
గంభీర్, అగార్కర్ ను కాదని నేరుగా బీసీసీఐ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారట. ప్రతి విషయాన్ని నేరుగా బీసీసీఐ అధికారులకు చేరవేస్తున్నారట సీనియర్లు. 2027 వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి తమ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు కూడా సమాచారం అందుతోంది. రానున్న రోజుల్లో జట్టులో తమ పాత్ర ఏంటో చెప్పాలని అడిగినట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గంభీర్, అగార్కర్ ఉంటే తమకు అవకాశాలు రాబోవని కూడా బీసీసీఐ పెద్దల వద్ద తమ బాధను చెప్పుకున్నారట. దీంతో గంభీర్ పై సీనియర్లు తిరుగుబాటు చేశారని సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.






